: మనం అనుకున్నవి సాధించినప్పుడు ఆ ఆనందమే వేరు: నిర్మాత దిల్ రాజు


జీవితంలో మనం అనుకున్న వాటిలో కొన్నింటిని సాధించినప్పుడు పొందే ఆనందం వేరుగా ఉంటుందని.. ఆ కొన్నింటిలో ‘శతమానం భవతి’ ఒకటని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు వరించిన సందర్భంగా ‘అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ సంస్థ తరపున నిర్మాత అల్లు అరవింద్ ఆయన్ని సన్మానించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, జీవితంలో ఎంతో సాధించిన సందర్భంలోనే మరెంతో కోల్పోయానని, ఆ బాధ ఎలాంటిదో తనకు చాలా దగ్గరగా ఉండే అరవింద్ కు తెలుసని అన్నారు. తాను సాధించిన ఈ జాతీయ అవార్డు కంటే అరవింద్ లాంటి మంచి వ్యక్తితో చేసిన స్నేహం చాలా గొప్పదన్నారు.

  • Loading...

More Telugu News