: అమెరికా నైట్ క్లబ్ లో మళ్లీ కాల్పులు..ఇద్దరి పరిస్థితి విషమం!
అమెరికాలో మళ్లీ దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓహియో రాష్ట్రంలోని ఓ నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఈశాన్య కొలంబస్ లో ఈ రోజు తెల్లవారుజామున కాల్పులు జరిగిన సమాచారం తమకు తెలియడంతో సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే విషయం తెలియాల్సి ఉందని, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.