: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదంపై చంద్రబాబు ఆగ్రహం!


కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులుగా జరిగిన ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని, ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఘటనలకు చోటులేదని అన్నారు. ఈ వివాదంపై నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆదేశించారు.

తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని చంద్రబాబు సూచించారు. కాగా, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కౌన్సిలర్ ఓ విద్యుత్ వైరును తన మెడకు చుట్టుకోవడం, ఈ ఎన్నిక వాయిదాకు పోలీసులు, అధికారులే కారణమని ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే.  

  • Loading...

More Telugu News