: తెలుగు తేజాల సమరం.. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేత సాయి ప్రణీత్


తెలుగు తేజాలు తలపడ్డ  సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల ఫైనల్స్ లో సాయి ప్రణీత్ విజేతగా నిలిచాడు. కిదాంబి శ్రీకాంత్ పై 17-21, 21-17,21-12 తేడాతో ప్రణీత్ విజయం సాధించాడు. సాయి ప్రణీత్ కెరీర్ లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ గెలుకున్నాడు. కాగా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో.. శ్రీకాంత్, సాయి ప్రణీత్ నువ్వా? నేనా? అన్నట్లు తలపడ్డారు. తొలి గేమ్ ను శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్ లోనూ 6 పాయింట్ల వరకు శ్రీకాంత్ హవా కొనసాగినప్పటికీ, ఆ తర్వాత సాయి ప్రణీత్ పుంజుకుని తన సత్తా చాటాడు. మూడో సెట్ లో ప్రణీత్ మరింతగా విజృంభించి సూపర్ సిరీస్ ను సాయిప్రణీత్ తన సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News