: గిరిజన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: కిషన్ రెడ్డి
గిరిజన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, మద్దతు ఇస్తున్నామని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రిజర్వేషన్లను తాము అడ్డుకుంటున్నామని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు ఒకే బిల్లుగా కలిపి పెట్టడం రాజ్యాంగం వ్యతిరేకమని కిషన్ రెడ్డి అన్నారు.