: జగన్ కు సీఎం పిచ్చి ఇంకా తగ్గలేదు: మంత్రి దేవినేని


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం పిచ్చి ఇంకా తగ్గలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేందుకు జగన్ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని జగన్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ కుట్ర పన్నుతున్నారని, పక్క రాష్ట్రాల వాళ్లను రెచ్చగొట్టి పనులు ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పనులు ఆపేందుకు గ్రీన్ ట్రైబ్యునల్ లోను, సుప్రీంకోర్టులోను కేసులు వేయిస్తున్నారని అన్నారు. ప్రజల మద్దతుతో ఈ కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుంటామని ఉమ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News