: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. గిరిజనులు, బీసీ-ఈ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా సభకు బీజేపీ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారు. బీజేపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ సెషన్ వరకు వారి సస్పెన్షన్ వర్తిస్తుంది.