: నేడు చారిత్రాత్మకమైనది... అసెంబ్లీలో కోటా పెంపు బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్


మైనారిటీలు, ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది మతపరమైన రిజర్వేషన్ బిల్లు కాదని, సామాజిక పేదరికం కారణంగా అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లని, జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళుతున్నామని తెలిపారు. త్వరలోనే ఎస్సీ కమిషన్ ను ఏర్పాటు చేసి, వారికీ జనాభా ప్రాతిపదికన ఒక శాతం వరకూ రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు.

బిల్లుతో బీసీలకు అన్యాయం జరుగుతుందని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, బీసీల రిజర్వేషన్ కు ఈ బిల్లుతో ఎటువంటి ముప్పూ ఉండదని, వారి రిజర్వేషన్ కోటానూ పెంచేందుకు ఆరు నెలల్లో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ బిల్లును కూడా తానే ప్రతిపాదిస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు రిజర్వేషన్లపై 107 సభల్లో తాను మాట్లాడానని, ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపును ప్రవేశపెట్టిన నేడు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

  • Loading...

More Telugu News