: పార్టీ మారాలని భావిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్... అందుకే అధినేతపై ధిక్కార ధోరణి!


తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై ధిక్కార స్వరం వినిపించిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్, త్వరలోనే పార్టీ మారనున్నారని, అందుకోసమే ఇలా మాట్లాడుతున్నారన్న ప్రచారం మొదలైంది. టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని ఆయన నిర్ణయించుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆయన్ను సస్పెండ్ చేయాల్సిందేనని పలువురు మంత్రులు చంద్రబాబుకు సిఫార్సు చేశారు.

ఇక శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదో ఆవేశంలో శివప్రసాద్ వ్యాఖ్యలు చేసి వుంటారని, ఆపై వాటిని సరిదిద్దుకుంటారని టీడీపీ నేతలు ఊహించగా, శనివారం నాడు సైతం ఆయన తమ మాటలను సమర్థించుకుంటూ, తననెవరూ ఏమీ చేయలేరనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడటాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక పార్టీ మారే ఉద్దేశముందని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇక ఆయన పార్టీ మారదలచుకుంటే వైకాపాలో చేరుతారా? లేక బీజేపీని ఆశ్రయిస్తారా? అన్న విషయమై మాత్రం స్పష్టత లేదు. అసలీ విషయంలో శివప్రసాద్ అభిప్రాయం కూడా అధికారికంగా వెల్లడికాలేదు. ఇదిలావుండగా, ఏ విషయాన్నైనా తమ నేత సూటిగా ప్రశ్నిస్తారని, ఆయన మాటలను భూతద్దంలో చూస్తున్నారని, ఇది ఎంత వరకూ భావ్యమని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News