: బొబ్బిలిలో కాల్పుల కలకలం... వ్యాపారిని కాల్చి, తాపీగా లొంగిపోయిన బీహార్ వ్యక్తి!
విజయనగరం జిల్లా బొబ్బిలి కాల్పులతో అట్టుడికి పోయింది. బీహార్ నుంచి సుపారీ తీసుకుని వచ్చిన ఓ గ్యాంగు సభ్యుడు వ్యాపారి అక్కినేని జగన్ మోహన్ రావుపై దగ్గరి నుంచి కాల్పులకు పాల్పడ్డాడు. ఆపై తాపీగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనలో జగన్ మోహన్ రావుకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారన్న విషయాన్ని విచారణలో నిగ్గు తేలుస్తామని తెలిపాయి.