: హైదరాబాద్ దిగ్బంధం... బీజేపీ నేతల అరెస్టులతో ఉద్రిక్తత!


కేసీఆర్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీసుకురానున్న మతపరమైన రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ, బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించిన వేళ, నగరంలోని పలువురు బీజేపీ నేతలను, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దిగిన బీజేపీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. శంషాబాద్, ఎల్ బీ నగర్, బోడుప్పల్, మేడ్చల్, పటాన్ చెరువు తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి నగరంలోకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరికాసేపట్లో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరుతుండటంతో, ఈ ప్రాంతంలో బందోబస్తును పెంచారు. అసెంబ్లీ చుట్టు పక్కలా నిషేధాజ్ఞలు విధించారు. దీంతో సాదారణ ట్రాఫిక్ కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News