: మేనల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శశికళకు నో చాన్స్... పెరోల్ నిరాకరణ


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, తన అన్న కుమారుడు, నిన్న గుండెపోటుతో మరణించిన టీవీ మహదేవన్ అంత్యక్రియలకు హాజరు కాబోవడం లేదు. ఆమె పెట్టుకున్న పెరోల్ ధరఖాస్తును న్యాయమూర్తి తిరస్కరించారు. నిన్న ఓ దేవాలయానికి వెళ్లిన మహదేవన్‌ గుండెనొప్పిగా ఉందని చెప్పి, కుప్పకూలి, ఆసుపత్రికి తరలించేలోపే మరణించిన సంగతి తెలిసిందే. జయలలిత హయాంలో ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. ఇక ఆయన అంత్యక్రియలకు హాజరు కావాలని శశికళ దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే పలువురు మంత్రుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయని, వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలో, శశికళ బయటకు వస్తే, కేసులు ప్రభావితమవుతాయని పోలీసులు చేసిన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News