: మహాకూటమికి ఓకే... మాయావతితో కలిసేందుకు అఖిలేష్ సంకేతాలు!
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీతోనైనా కలిసేందుకు తాను సిద్ధమని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పిన మర్నాడే, సమాజ్ వాదీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం అదే మాట చెప్పారు. కాషాయీకరణను అడ్డుకునేందుకు తాను మాయావతితో కలిసేందుకు సిద్ధమేనన్న సంకేతాలు పంపుతూ, మహా కూటమిలో భాగమయ్యేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, అందుకోసం ఇతర భావసారూప్య పార్టీలతో కలిసేందుకు తమ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని విపక్ష పార్టీలన్నీ, బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు.