: శివప్రసాద్ ఏమన్నాడో ఒక్క ముక్కా అర్థం కాలేదు: మంత్రి అమర్ నాథ్ రెడ్డి


చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడిన మాటలు తనకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని ఏపీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, దళితులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అందినటువంటి సంక్షేమ పథకాలు మరే ఇతర పార్టీల ప్రభుత్వాలున్న సమయంలో అందలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, ఓ దళితుడైన నారాయణన్ ను రాష్ట్రపతి పదవికి ఎంపికయ్యేలా చూశారని ఆయన గుర్తు చేశారు. ఆపై లోక్ సభ స్పీకర్ గా బాలయోగిని, రాష్ట్ర సభాపతిగా దళిత సోదరి ప్రతిభా భారతిని కూర్చోబెట్టారని, ఏ ప్రభుత్వమూ చేయని పథకాలను తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నో చోట్ల జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించి వారి సేవలు ప్రజల్లో గుర్తుండిపోయేలా చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, స్వప్రయోజనాల కోసం పార్టీ పరువును బజారున పెట్టవద్దని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News