: అమరావతిపై చంద్రబాబుకు, నారాయణకు అవగాహన లేదు: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి అభివృద్ధిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, మంత్రి నారాయణకు ఎంతమాత్రమూ అవగాహన లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు బ్యాంకులతో ఒప్పందాలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి నారాయణతో సమావేశమైన జేసీ, నేతలకు స్థలాలు మాత్రమే ఇస్తే, వాటిని అధిక ధరలకు అమ్ముకుంటారని, ఈ విషయం చంద్రబాబుకు తెలియదని అన్నారు. అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేకనే కేవలం భవంతులను నిర్మించి వదిలేశారని, దీనివల్ల అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని, వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు.