: భారత్ ను బద్నాం చేసేందుకు పాక్ కుతంత్రం... ముగ్గురు గూఢచారులను అరెస్ట్ చేశామని ప్రకటన!


కుల్ భూషణ్ యాదవ్ కు మరణశిక్ష విధించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్, ఎలాగైనా ఇండియా పరువును బజారున పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీరు)లో ముగ్గురు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)కు చెందిన గూఢచారులను అరెస్ట్ చేశామని తెలుపుతూ, వారిని రావల్ కోట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టింది. వీరంతా అబ్బాస్ పూర్ సమీపంలోని తారోటి గ్రామస్థులని, ప్రధాన రా ఏజంట్ ఖలీల్ 2014 నుంచి భారత్ కు పని చేస్తున్నాడని పాక్ పోలీసులు ప్రకటించారు.

 పూంచ్ లో పర్యటించిన ఖలీల్, రా అధికారులతో సంబంధాలు పెంచుకున్నాడని, ముగ్గురిపైనా ఉగ్ర వ్యతిరేక చట్టాల కింద కేసులు పెట్టామని తెలిపారు. ఇదిలావుండగా, పాకిస్థాన్ తో వచ్చే వారంలో సముద్ర భద్రతపై జరగాల్సిన చర్చలను రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. పాక్ లో ఉరిశిక్ష పడ్డ కులభూషణ్ జాదవ్ ను కలుసుకుని మాట్లాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News