: ఇక అఫీషియల్ టూర్స్ కు లోకేష్ శ్రీకారం


తెలుగుదేశం పార్టీ యువనేతగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడిగా, ఇప్పటికే పాలనా పరమైన వ్యవహారాల్లో తనదైన పాత్రను పోషిస్తూ వచ్చిన నారా లోకేష్, ఇక మంత్రిగా అధికారిక పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 17, 18వ తేదీల్లో ఆయన విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, నీరు - చెట్టు, జల సంరక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొంటారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఆపై ప్రతి జిల్లాలోనూ ఆయన పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News