: దీపికా పదుకునేకు గాయాలు... పద్మావతి షూటింగ్ కు బ్రేక్!


ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు గాయాలయ్యాయి. గాయలవ్వడానికి కారణం వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే... ఎందుకంటే ఆమె 'పద్మావతి' సినిమా కోసం ధరించిన నగల కారణంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'పద్మావతి'. ఈ సినిమాలో దీపికా పదుకునే రాణి 'పద్మావతి'గా కనిపించనుంది.

రాణి పాత్ర కావడంతో దీపిక కాస్ట్యూమ్స్ తో పాటు, బరువైన నగలు ధరించాల్సి ఉంటుంది. దీంతో ఆమె మెడకు ధరించిన నగలు ఆమెకు గాయం చేశాయట. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ కు బ్రేక్‌ వేసి, దీపికకు విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం షూటింగ్‌ షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చేసినట్లు సమాచారం. కాగా, నవంబర్ 17న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, రణ్‌ వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

  • Loading...

More Telugu News