: ఢిల్లీ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో షాకింగ్ వీడియో... మీరూ చూడండి!
నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్... ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు హడావుడిగా వెళ్తున్నారు. అలాంటి సమయంలో ట్రైన్ల టైమింగ్స్ చూపించే ఎల్ఈడీ టీవీలో నీలి చిత్రం ప్రత్యక్షమైంది. దీంతో స్త్రీలు సిగ్గుతో చచ్చిపోగా, కొంత మంది యువకులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన స్క్రీన్ లో అకస్మాత్తుగా నీలి చిత్రం ప్రత్యక్షమైంది. అంతా షాక్ తిన్నారు. కాసేపు ఆ వీడియో అలాగే ప్లే కావడంతో ఆ ప్రాంతం నుంచి ప్రయాణికులు వెళ్లిపోయారు. అయితే కొంత మంది యువకులు మాత్రం దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో షాక్ తిన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఎమ్‌ఆర్సీ) ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటు చేసుకోగా, ఆ టీవీ కమర్షియల్ యాడ్స్ కోసం ఉద్దేశించి పెట్టిన టీవీ అని తెలిపారు. ఆ వీడియో చూడండి.