: చిరుతకు చావును రుచిచూపిన ముళ్లపందులు... వీడియో చూడండి!
వేగంగా పరుగెత్తడం, ఒడుపుగా వేటాడంలో చిరుతపులి దిట్ట. తనను తాను రక్షించుకోవడంలో మళ్ల పంది బహుగడసరి. ఈ రెంటి మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనను సౌతాఫ్రికాలోని ఫేమస్ క్రూగర్ సఫారీలోకి వెళ్లిన యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత పులికి రెండు ముళ్లపందులు కనిపించాయి. అవి మెల్లగా వెళ్తుండడంతో వాటిని పరీక్షగా చూసిన చిరుత తన ఆహారానికి అనువైన జంతువులేనని నిర్ధారించుకుంది.
వాటితోపాటు కొంచెం దూరంగా నడిచిన చిరుత అదను చూసి ఒక దానిపై దాడి చేసింది. అది ప్రతిఘటించడంతో దానిని వదిలేసి... వేగంగా వెళ్లి రెండో ముళ్లపందిని చటుక్కున ఒడుపుగా పట్టేసింది. దానిని నోట కరించింది. అంతే ప్రమాదాన్ని గుర్తించిన ముళ్లపంది ఒక్కసారిగా తన ముళ్లంటినీ విచ్చుకునేలా చేసింది. అంతే ఒడుపుగా పట్టేశానని భావించిన చిరుతకు అసలు విషయం అర్ధమైంది. దీంతో దానిని ఒక్కసారి వదిలేసింది. లబోదిబో మంటూ నోట్లోకి, పొట్టలోకి దిగిపోయిన ముళ్లను తీసుకుంటూ బతుకుజీవుడా వెళ్లిపోయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా చూడండి.