: ముస్లింలతో, గిరిజన్లను కలిపి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారు: కిషన్ రెడ్డి


గిరిజనుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముస్లిం రిజర్వేషన్లతో పాటు ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కలిపి ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేవలం ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎస్టీ రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన చెప్పారు. అలా చిత్తశుద్ధి ఉంటే, ముస్లిం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లకు వేర్వేరుగా బిల్లు తెస్తుందని, అలా కాకుండా ఒకే బిల్లుతో శాసనసభ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.

మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధం కాదని ఆయన తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. న్యాయస్థానం ఈ రిజర్వేషన్ బిల్లులను కొట్టివేస్తుందని ఆయన తెలిపారు. అలా కోర్టు కొట్టివేస్తే... ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

  • Loading...

More Telugu News