: ముంబైలో విఖ్రోలీలో దారుణం...యువకుడ్ని చావగొట్టిన తాగుబోతులు


ముంబైలోని విఖ్రోలీలో దారుణం చోటుచేసుకుంది. బార్ లో పీకల్దాకా తాగిన ఐదుగురు దుర్మార్గులు ఓ యువకుడిని రూమ్ కు తీసుకెళ్లారు. ఒకడి తరువాత ఒకడుగా ఆ యువకుడిని చితక్కొట్టారు. కొన్ని గంటలపాటు ఆ యువకుడు ఎంతగా అరచిగీపెట్టినా తాగుబోతులు వదల్లేదు. బట్టలు విప్పి మరీ ఆ యువకుడ్ని చితక్కొట్టారు. కాళ్లు కట్టేసి, చేతులను బంధించి మరీ దాడి చేశారు. ఒళ్లంతా రక్తం కారుతున్నా వారు పట్టించుకోలేదు. అనంతరం ఇంటికి చేరుకున్న యువకుడు తల్లిదండ్రులతో కలిసి విఖ్రోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసు పెట్టారు. నిందితులను గుర్తించిన పోలీసులు, వారిలో కమలేష్ శెట్టి, సచిన్ చౌరే, ఇంకో వ్యక్తిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

  • Loading...

More Telugu News