: తెలంగాణలో 68 శాతానికి చేరుకోనున్న రిజర్వేషన్లు
తెలంగాణలో రిజర్వేషన్లు 68 శాతానికి చేరుకోనున్నాయి. తమిళనాడు తరహాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను ఆయన పంచుకున్నారు. రిజర్వేషన్లను 68 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ఇందులో బీసీ-ఈ కోటాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ 68 శాతానికి చేర్చారు. దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.