: ఎగ్జిబిషన్ లో వందలాది మందిని భయపెట్టిన బంగీ జంప్ విన్యాసం... షాక్ నుంచి తేరుకోని మహిళ


'బావగారూ బాగున్నారా' సినిమాలో చిరంజీవి చేసిన బంగీ జంప్ గుర్తుందా?... సాహసికులు చేసే ఆ విన్యాసం చూస్తేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాంటిది ఆ విన్యాసం చేస్తుండగా సేఫ్టీ బెల్టు ఊడిపోతే?...అమ్మో ఇంకేమైనా ఉందా? అచ్చం ఇలాగే అనుకున్నారు ఫ్రాన్స్ లోని ఓ ఎగ్జిబిషన్ కు వెళ్లిన వారు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ పారిస్ లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్‌ కు స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమె బంగీ జంప్‌ తరహాలో ఉండే బంగీ స్వింగ్‌ రైడ్‌ చేసేందుకు ఎక్కింది. రైడ్‌ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఆమె శరీరానికి వేసిన సేఫ్టీ బెల్ట్‌ ఒకటి వూడిపోయి మహిళ కిందకు జారిపోయింది.

అయితే అదృష్టవశాత్తు ఆమె కాళ్లు ఒక వైపు సేఫ్టీ బెల్టులో చిక్కుకుపోవడంతో ఆమె అంత ఎత్తులో తల్లకిందులుగా వేలాడుతూ బంగీ స్వింగ్ అవుతూ ఉంది. అయితే ఆమె కిందపడకుండా గాల్లోనే తల్లికిందులుగా వేలాడుతూ ఉండడంతో ఆ స్వింగ్ ను ఆపి ఆమెను రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ స్వింగ్ ఆటోమెటిక్ కావడంతో అది అదుపులోకి వచ్చేందుకు సమయం పట్టింది. దీంతో ఆమె షాక్ కు గురైంది. తాను మరణించానని భావించానని, అయితే అదృష్టవశాత్తు కిందపడిపోకుండా చిక్కుకుపోయి గాల్లో వేలాడానని తెలిపింది. ఈ తతంగం మొత్తం సెల్ ఫోన్ లో వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఎగ్జిబిషన్ కు వెళ్లిన వారు కూడా  ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిని మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News