: భారత్‌తో పాకిస్థాన్ డేంజర్ గేమ్ ఆడుతోంది.. భారత్ చూస్తూ ఊరుకోదు: మనోహర్ పారికర్
పాకిస్థాన్‌లో భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఓటి కుండకు మోతెక్కువ అన్నట్లుగా పాక్ తీరు ఉందని ఆయన అన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయని, మన దేశంపై పాకిస్థాన్ చేస్తోన్న ఆరోపణలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్‌తో పాకిస్థాన్ డేంజర్ గేమ్ ఆడుతోందని అన్నారు.
భారత్ తిరగబడితే గనుక పాక్ పోరాడలేదని పారికర్ వ్యాఖ్యానించారు. అయితే, మనదేశం ఈ విషయంలో శాంతియుతంగా వ్యవహరించడమే సరైందని చెప్పారు. పాకిస్థాన్ తనకు ఉన్న అలవాటు ప్రకారమే కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధించిందని అన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే భారత్ చూస్తూ ఊరుకోదని అన్నారు.