: శశికళ మేనల్లుడు టీవీ మహదేవన్ మృతి.. జైలులో పెరోల్ కు శశికళ దరఖాస్తు
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ సోదరుడి కుమారుడు టీవీ మహదేవన్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తంజావూరులోని మహాలింగేశ్వర ఆలయ సందర్శనకు వెళ్లిన మహదేవన్ గర్భగుడి ఎదురుగా పూజలు నిర్వహిస్తోన్న సమయంలో గుండెపోటుతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. జయలలిత మృతి చెందిన అనంతరం మహదేవన్ పార్టీ ఫోరమ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వచ్చిన సమయంలో మహదేవన్ ఆమె వెన్నంటే ఉన్నారు. జైలులో ఉన్న శశికళ ఈ వార్త తెలుసుకొని తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.