: రాజీనామాను ఉపసంహరించుకుంటున్నా: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనను క్యాబినెట్ నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు మీడియాకు పలు విషయాలు చెప్పారు. క్యాబినెట్ విస్తరణ అనంతరం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, అయితే, పార్టీకి రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. అయితే, ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. తనకు మద్దతుగా నిలిచి రాజీనామాలు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.