: కోస్తాలో జోరుగా కోడి పందేలు.. 30 మంది అరెస్ట్


ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో జోరుగా కోడి పందేలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కోడి పందేలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7 కార్లు, రూ. 1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో కూడా కోడి పందేలు ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక కారు, మూడు బైక్ లు, రూ. 2.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News