: మ‌రో క‌ల‌కలం.. మరో ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన‌ పాకిస్థాన్‌


పా‌కిస్థాన్ త‌మ తీరుని మార్చుకోవ‌డం లేదు. భార‌త్‌తో త‌మ‌కు ఉన్న విభేదాల‌ను మరింత పెరిగేలా మ‌రో దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డింది. భార‌త నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన అంశంపై ఇరు దేశాల మ‌ధ్య మ‌రోసారి మాట యుద్ధం కొన‌సాగుతుండ‌గానే మరో ముగ్గురు భారతీయులను పాకిస్థాన్‌ అరెస్టు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ ముగ్గురు భార‌తీయుల‌ను రా (రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) ఏజెంట్లుగా భావిస్తూ ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కుల్‌భూష‌ణ్ ను విడింపించ‌డానికి భార‌త్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోన్న స‌మ‌యంలో పాక్ మ‌ళ్లీ భార‌తీయుల‌ను అరెస్టులు చేయ‌డం మరింత అల‌జ‌డి రేపేలా ఉంది.

  • Loading...

More Telugu News