: బాలీవుడ్ సినిమాలలో నటించడమే నా లక్ష్యం అంటున్న విండీస్ క్రికెటర్
వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్స్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా రస్సెల్స్ మాట్లాడుతూ, ఎక్కువగా ఇండియాను దృష్టిలో పెట్టుకునే ఈ వీడియోను విడుదల చేయనున్నామని చెప్పాడు. బాలీవుడ్ సినిమాలలో నటించాలనే కోరిక తనకు ఉందని... అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపాడు. మరోవైపు, పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఆల్బమ్ 'సారీ'కి ప్రొడక్షన్ హౌస్ గా వ్యవహరించిన సంస్థనే రస్సెల్ ఆల్బమ్ ను కూడా నిర్మిస్తోంది. మరో వెస్టిండియన్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఇప్పటికే ట్రిప్ అబీ బాకీ హై, ఛాంపియన్ లాంటి మ్యూజిక్ వీడియోలను విడుదల చేశాడు.