: ఇప్పుడేం చేయాలబ్బా?: ఉత్తర కొరియా విషయంలో చేసిన తప్పుకు ఇబ్బంది పడుతున్న చైనా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తక్కువగా అంచనా వేసిన చైనా ఇప్పుడు సతమతమవుతోంది. ఉత్తరకొరియాను ఇంతకాలం పెంచి పోషించిన చైనాకు... ఇప్పుడు ఆ దేశమే ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరకొరియాను నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత చైనాదేనని... ఆ పని చైనా చేయకపోతే, తామే చేయాల్సి వస్తుందని కొన్ని రోజుల క్రితం ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆయన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టింది. దీంతో, ట్రంప్ తాను అనుకున్నంత పని చేయడానికి సిద్ధమయ్యారు. భారీ ఎత్తున సైన్యాన్ని, యుద్ధ సామాగ్రిని దక్షిణకొరియాకు పంపించారు. దీంతో, ఇప్పుడు చైనా అప్రమత్తమైంది. ఇరుదేశాలు తొందరపడవద్దని, సంయమనం పాటించాలని ఇప్పుడు నీతులు చెబుతోంది.

అంతేకాదు, ఉత్తరకొరియాకు విమాన సర్వీసులను చైనా నిలిపి వేసింది. ఉత్తరకొరియాలో ఉద్రిక్తతలు మరింత పెరగడం కాని, యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం కానీ జరిగితే... ఆ దేశం నుంచి భారీ సంఖ్యలో జనాలు చైనాకు చేరుకుంటారు. ఇది చైనాలో సంక్షోభానికి కారణమవుతుంది. అంతేకాదు, యుద్ధం కారణంతో అమెరికా సైన్యం చైనాకు మరింత సమీపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో, చైనా ఇప్పుడు సతమతమవుతోంది.

More Telugu News