: నన్ను చూసి గద్దర్ అసూయపడ్డారు: రసమయి బాలకిషన్
ఎమ్మెల్యేగా తాను గెలుపొందడాన్ని చూసి ప్రజా గాయకుడు గద్దర్ అసూయ చెందారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే కారణంతో అందెశ్రీ కూడా రెండేళ్ల పాటు తనతో మాట్లాడలేదని చెప్పారు. నిన్న రవీంద్రభారతిలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దళితులంతా ఈర్ష్యాద్వేషాలను పక్కనపెట్టాలని... హక్కుల సాధన కోసం కలసికట్టుగా పోరాడాలని చెప్పారు. ఐక్యత లేకపోతే మనం ఏమీ సాధించుకోలేమని అన్నారు.