: హైదరాబాదులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యం
హైదరాబాదులో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గీతారాణి (22) ఘట్ కేసర్ మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇన్ఫోసిన్ కంపెనీలో పని చేస్తోంది. అక్కడకు దగ్గర్లోనే ఉన్న సింగపూర్ టౌన్ షిప్ లో నివాసం ఉంటోంది. ఈ నెల 12వ తేది నుంచి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఆమె తండ్రి బల్ భీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.