: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాదన్న ఎమ్మెల్యే


రాజస్థాన్‌లోని భరత్‌పుర్ బీజేపీ శాసనసభ్యుడు విజయ్ బన్సాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భరత్‌పూర్‌లోని కృష్ణానగర్‌లో పాఠశాల ప్రారంభోత్సవానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కాదని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆయనను అలా మార్చివేశాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ తెలివైన వారనడంలో ఎలాంటి సందేహం లేదన్న విజయ్.. బాబూ రాజేంద్రప్రసాద్ చైర్మన్‌గా ఉన్న కమిటీలో ఆయనో సభ్యుడు మాత్రమేనని పేర్కొన్నారు. విజయ్ బన్సాల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అతడి సొంత అభిప్రాయం మాత్రమే కాదని తన పార్టీ ఆలోచనాధోరణిని ఆయన వెలిబుచ్చారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ట్విట్టర్‌లో విమర్శించారు.

  • Loading...

More Telugu News