: నా వాయిస్ ను మిమిక్రీ చేయడం కష్టం: కమెడియన్ శివారెడ్డి
తన వాయిస్ ను మిమిక్రీ చేయడం కష్టమని ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, కమెడియన్ శివారెడ్డి అన్నాడు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా వాయిస్ న్యూట్రల్ వాయిస్.. దీనిని వేరే వారు మిమిక్రీ చేయడం కష్టం. ఇప్పుడు, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ సాఫ్ట్ గా ఉంటుంది. ఈ వాయిస్ ను నేను మిమిక్రీ చేయలేను. వేరే మిమిక్రీ ఆర్టిస్ట్ కు ఈ వాయిస్ దగ్గరగా ఉన్నవాళ్లు, ఈ వాయిస్ ను ఇమిటేట్ చేయగల్గుతారు. సో... న్యూట్రల్ గా, సాఫ్ట్ గా ఉండే వాయిస్ లను ఇమిటేట్ చేయడం కొంచెం కష్టం. పీల వాయిస్ ఉండాలి లేదా బేస్ వాయిస్, డిఫరెంట్ వాయిస్ ఉంటే ఇమిటేట్ చేయవచ్చు’ అని చెప్పుకొచ్చాడు.