: చివరి క్షణం వరకు కాంగ్రెస్ లోనే ఉంటా: రఘువీరారెడ్డి


తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారంపై ఏపీ పీసీసీ నేత రఘువీరారెడ్డి స్పందించారు. తాను పార్టే మారే ప్రసక్తే లేదని, చివరి క్షణం వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. పదవుల కోసం పార్టీ మారేవారు బలహీనులు, నికృష్టులని విమర్శించారు. తన సహచరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనే కుట్రతోనే తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం సాగుతోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. విగ్రహాలు ప్రతిష్టించడం కాదు, అంబేద్కర్ ఆశయాలను పాటించాలని ఆయా పార్టీలకు ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News