: అది వారికే అవమానం!: సీఆర్‌పీఎఫ్ జవానుపై దాడిపై కమల హాసన్
ఇటీవల జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కొందరు యువకులు దాడి చేసిన అంశంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై సినీనటుడు కమలహాసన్ ఘాటుగా స్పందించారు. జవాన్లపై చేయిచేసుకోవాలనుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఎవరు అలాంటి ప్రయత్నం చేశారో వారికే అది అవమానం అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అహింసే శౌర్యానికి పరాకాష్ట అని, దీనికి సీఆర్‌పీఎఫ్ జవాను ఉదాహరణగా నిలిచాడని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్ యువకులు చేయిచేసుకున్నప్పటికీ జవాన్లు ప్రదర్శించిన సహనం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
Integrrate into India . Shame onthose who dare touch my soldiers. Height of valour is nonviolence. CRPF has set a fine example
— Kamal Haasan (@ikamalhaasan) April 14, 2017