: తేనెటీగల దాడులు.. నిర్మల్ లోను, విశాఖ స్టీల్ ప్లాంట్ లోను పలువురికి గాయాలు!


తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలోను, ఏపీలోని విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ లోను తేనెటీగలు దాడి చేసిన సంఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు .. హైదరాబాద్ లోని దూలపల్లి అటవీ అకాడమీకి చెందిన 60 మంది అధికారులు శిక్షణ నిమిత్తం నిర్మల్ లోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఆరుగురు అధికారులు తీవ్రంగా గాయపడగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మరో సంఘటనలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అంబేద్కర్ జయంతి వేడుకల ప్రాంగణంలో తేనెటీగలు దాడి చేశాయి. సభ ప్రారంభమైన కొంచెం సేపటికి ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

  • Loading...

More Telugu News