: భీమ్ యాప్‌ను రిఫర్ చేయండి.. రూ.10 పొందండి: మోదీ
నగదురహిత చెల్లింపుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమ్-ఆధార్ యాప్ విడుదలైన విషయం తెలిసిందే.
అయితే, ఈ యాప్ అందరికీ చేరేలా యూజర్లు షేర్ చేస్తే ప్రోత్సాహకంగా రిఫరల్ బోనస్‌ను ప్రకటించారు. ఈ యాప్‌ను రిఫర్ చేసిన వ్యక్తి.. మూడు లావాదేవీలు చేసిన తర్వాత రూ.10 పొందవచ్చని మోదీ చెప్పారు. ఈ పథకం ఈ ఏడాది అక్టోబర్ 14 వరకూ కొనసాగుతుందని తెలిపారు. భీమ్-ఆధార్ యాప్ ద్వారా దేశంలోని మరిన్ని నగరాల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.