: చంద్రబాబును కలిసిన లగడపాటి రాజగోపాల్

సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. వెలగపూడి సచివాలయంలో చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశాను. తొలిసారి సచివాలయానికి వచ్చాను. చాలా బాగుంది. తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే.. శాశ్వత సచివాలయం ఇంకెంత అందంగా ఉంటుందో!’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.