: థాంక్యూ మై డియర్‌ అమ్మా: అక్కినేని అఖిల్


త‌న కుమారుడు అక్కినేని అఖిల్‌తో క‌లిసి అమ‌ల ఈ రోజు సెట్స్‌లో లంచ్ చేసింది. ఈ విష‌యాన్ని చెబుతూ అఖిల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ రోజు సెట్స్ లో బ్యూటీఫుల్‌ లేడీతో లంచ్‌ చేశాన‌ని పేర్కొన్నాడు. త‌న త‌ల్లి నవ్వు త‌న‌కు చాలా ఇష్టమ‌ని అన్నాడు. థాంక్యూ మై డియర్ మ‌ద‌ర్ అని పేర్కొన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న మూవీలో న‌టిస్తోన్న అఖిల్ హైదరాబాద్ లోనే షూటింగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంగా త‌న త‌ల్లితో క‌లిసి భోజ‌నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జున్ను’ లేక‌ ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ టైటిల్‌ని  పరిశీలిస్తున్నారు.
 

  • Loading...

More Telugu News