: తమిళనాడులో మంత్రి విజయ్‌భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపై వేటు?
తమిళనాడులో జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలు సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. ఆ నియోజకవర్గంలో ఐటీ అధికారులు జరిపిన దాడిలో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై త్వరలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు ఆయన కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అంతేగాక, విజయ్‌భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైన కూడా పళనిస్వామి వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు మంత్రులు తమ అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశం కూడా పళనిస్వామి వర్గంలో ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికను రద్దు చేసిన విషయం తెలిసిందే.