: కుల్‌భూషణ్‌కు న్యాయ సహాయం చేయొద్దు.. ఉరితీయాల్సిందే: పాక్ లాయర్ల సంచలన నిర్ణయం
పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ సహాయం అందించరాదని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఆయనకు ఎవరైనా న్యాయ సహాయం అందిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని పేర్కొంది. కుల్‌భూషణ్ విషయంలో తమ దేశ సర్కారు వెనక్కు తగ్గరాదని, విదేశీ ఒత్తిళ్లకు కూడా లొంగరాదని సూచించింది. ఆయనను విడిపించడానికి భారత్ తమ దేశంపై ఒత్తిడి తెస్తోందని, గుఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతూ.. తమ దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కుల్‌భూషణ్‌ను ఉరితీయాల్సిందనని డిమాండ్ చేసింది.