: దళితులకు వరాలు ప్రకటించిన చంద్రబాబు


రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున దళితులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు ప్రకటించారు. దళితులు పేదరికం నుంచి బయటకు రావాలని... అందుకోసం వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ పుస్తకాలతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళితులకు 75 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. దళితులకు న్యాయం టీడీపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలని ముఖ్యమంత్రి అభిలషించారు. 

  • Loading...

More Telugu News