: రైతుకి ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్!
డబుల్ బెడ్ రూం లబ్ధిదారి అయిన ఓ మహిళకు ఇటీవలే ఫోన్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెతో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. తనలాంటి సాధారణ మహిళకు సీఎం ఫోన్ చేయడం పట్ల ఆమె కూడా పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, ఈ రోజు కేసీఆర్ ఓ రైతుకు ఫోన్ చేశారు. వచ్చే ఏడాది నుంచి కాంప్లెక్స్ ఎరువులను ఉచితంగా అందిస్తానని నిన్న తాను చేసిన ప్రకటన గురించి అడిగారు. నిన్న రాత్రి సీఎం నుంచి ఫోన్ కాల్ అందుకున్న పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన చెందిన రైతు నల్ల నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాను చేసిన ప్రకటన ఎలా ఉందని కేసీఆర్ అడగగా.. బాగుంది సార్ అని నాగిరెడ్డి అన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని, రైతులు మిమ్మల్ని జీవితంలో మరిచిపోరని ఆయన కేసీఆర్‌తో అన్నారు.