: ఉచిత ఎరువుల ఆలోచన మాదే.. మేం చర్చిస్తుండగానే కేసీఆర్ కు లీకైంది: కాంగ్రెస్


రైతులకు వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ఈ విషయంపై తాము చర్చిస్తుండగానే, ఈ విషయం లీకై కేసీఆర్ కు చేరిందని చెప్పారు. దీంతో, క్రెడిట్ మాకు వస్తుందని భావించిన కేసీఆర్.. హడావుడిగా ఉచిత ఎరువుల హామీని ఇచ్చారని తెలిపారు.  

  • Loading...

More Telugu News