: ఐస్‌క్రీంలు అమ్మిన మంత్రి కేటీఆర్.. రూ.5 ల‌క్ష‌లు ఇచ్చి ఐస్ క్రీం కొనుక్కున్న ఎంపీ మ‌ల్లారెడ్డి!


నేటి నుంచి ఈ నెల 20 వ‌ర‌కు ‘గులాబీ కూలీ దినాలు’గా ప్ర‌క‌టిస్తున్నట్లు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ తెలిపిన విష‌యం తెలిసిందే. సీఎం నుంచి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త వరకు అందరూ ఇందులో పాల్గొనాల‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అందులో భాగంగా ఈ రోజు మంత్రి కేటీఆర్ ఐస్‌క్రీంలు అమ్మే కూలీగా ప‌నిచేశారు. న‌గ‌రంలోని సుచిత్ర చౌరస్తాలోని ఓ ఐస్‌క్రీం షాపులో స్వ‌యంగా ఐస్‌క్రీం త‌యారు చేసిన కేటీఆర్ అనంత‌రం వాటిని అమ్మారు. కేటీఆర్ త‌యారు చేసిన ఐస్‌క్రీంను ఎంపీ మ‌ల్లారెడ్డి రూ.5 ల‌క్ష‌ల‌కు కొనుక్కున్నారు. మ‌రో ఐస్ క్రీంను నిజాంపేట‌కు చెందిన శ్రీ‌నివాస్ రెడ్డి అనే వ్య‌క్తి రూ.ల‌క్ష‌కు కొన్నారు. కేటీఆర్ త‌యారు చేసిన టీ, కాఫీలు కూడా భారీ రేటుకి అమ్ముడుపోయాయి. కేటీఆర్ కూలీ పని చేసి మొత్తం రూ.7 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News