: మతపరమైన రిజర్వేషన్లు మరో పాకిస్థాన్ ఏర్పాటుకు దారి తీస్తాయి: వెంకయ్య
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. గతంలో మతపరమైన రిజర్వేషన్లను తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖరరెడ్డిలు కూడా ప్రయత్నించారని... అప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకించిందని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్లను వాడుకోరాదంటూ పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు మరో పాకిస్థాన్ ఏర్పాటుకు దారి తీస్తాయని చెప్పారు. మతపర రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని తెలిపారు.