: పాఠశాల విద్యార్థులకు హీరోయిన్ రకుల్ పాఠాలు


సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ నిజజీవితంలో టీచర్ అవతారం ఎత్తింది. సినీన‌టి, నిర్మాత మంచు లక్ష్మీ స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యక్రమంలో ఆమె చురుకుగా పాల్గొంది. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విధ్యార్ధులకు ర‌కుల్ పాఠాలు చెప్పింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో వ్యతిరేఖపదాల గురించి, ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి ఆమె చెప్పంది.
న‌గ‌రంలోని మ‌రికొన్ని పాఠ‌శాల‌ల్లో కూడా టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఇటువంటి కార్య‌క్ర‌మాల‌నే నిర్వ‌హించ‌నుంది.

 ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు ఆంగ్ల‌భాష‌, నాయకత్వ లక్షణాలు మెరుగుపరచ‌డానికి ఆ సంస్థ కృషి చేస్తోంది. తనకు పాఠాలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు రకుల్ మంచు లక్ష్మికి థ్యాంక్స్ చెబుతూ తన ట్విట్టర్ లో పలు ఫొటోలు పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News