: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ ఫిర్యాదు!
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదంటూ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బాలకృష్ణకు సినిమాలపై ఉన్న శ్రద్ధ, తన నియోజకవర్గంపై లేదని, అభివృద్ధిని గాలి కొదిలేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. హిందూపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైఎస్సార్సీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వారు మండిపడ్డారు.